రూ.1500 పడలే..రెండు విడతల్లోనూ అందని సర్కారు సాయం

రూ.1500 పడలే..రెండు విడతల్లోనూ అందని సర్కారు సాయం
  •     బ్యాంకులో వెయ్యలే..పోస్టాఫీసులో ఇయ్యలే
  •     ఆఫీసుల చుట్టూ లబ్ధిదారుల చక్కర్లు

హైదరాబాద్, వెలుగు: తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.1,500 రెండు విడతల్లోనూ చాలామందికి అందలేదు. బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ అవ్వక, పోస్టాఫీస్​లో ఇవ్వక జనం ఆర్డీఓ, చీఫ్ రేషనింగ్, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సిబ్బంది కరోనా విధుల్లో బిజీగా ఉండటంతో అక్కడా సరైన సమాధానం రావడం లేదు. హైదరాబాద్ జిల్లాలోని 674 రేషన్ షాపుల పరిధిలో 5,80,747 తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఆ లబ్ధిదారుల్లో చాలామందికి ప్రభుత్వం ఇస్తానన్న రూ.1500 అందలేదు.

టోల్ ఫ్రీలు పని చేయట్లే

లబ్ధిదారుల్లో కొద్దిమందికి బియ్యం వచ్చినా డబ్బు రాలేదు.. మరికొందరికి రెండూ అందలేదు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు సివిల్ సప్లయ్ సర్కిల్ ఆఫీసులకు డైలీ వందల మంది వస్తున్నారు. అధికారులు వారి వివరాలు తీసుకుని కమిషనర్ ఆఫీసుకు పంపుతున్నారు. సర్కారు సాయం అందకుంటే టోల్ ఫ్రీ 1967, లేదా 040–23324614, 040–-23324615 నంబర్లకు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చని ప్రభుత్వం చెప్పినా.. అవి పనిచేయడం లేదని జనం వాపోతున్నారు. రేషన్ కార్డు కోసం జనతా కర్ఫ్యూకు ముందు దాదాపు 70 వేల మంది దరఖాస్తు చేసుకోగా, అవన్నీ పెండింగ్ లోనే ఉన్నాయి.

ఆధార్ లింక్ తప్పనిసరి

బ్యాంక్ అకౌంట్‌‌‌‌కు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే డబ్బులు రావడం లేదని సివిల్ సప్లయ్ అధికారులు చెప్తున్నారు. అలాంటి వారు వెంటనే యాడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్డ్ హోల్డర్ చనిపోయి ఉన్నా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఏఎస్ఓ, సీఆర్ఓలకు వచ్చి మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

84%  ఫ్యామిలీల ఆదాయం తగ్గింది