హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ంలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్-I, II, III బదిలీలు, పోస్టింగ్‌లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాల్లో పనిచేస్తున్న ఎంపీడీవోల పూర్తి వివరాలను సేకరించి మే 1లోగా అందజేయాలని జడ్పీ సీఈవోలను ఆదేశించింది. హార్డ్ కాపీలతో పాటు సాఫ్ట్ కాపీలను cpr.e.section@gmail.com కు పంపాలని పేర్కొంది.
కార్యదర్శుల వివరాలను ఈ నెల 30లోగా పంపాలని డీపీవోలకు సూచించింది. ఎక్సెల్ ఫార్మాట్‌లో సంతకం చేసిన కాపీలను cpr.ps.section@gmail.com ద్వారా పంపాలని సూచించింది.

