ఉదయ్ స్కీమ్కు రూ.1,231 కోట్లు,,డిస్కంల నష్టాల్లో 50 శాతం భరిస్తున్న రాష్ట్ర సర్కారు

ఉదయ్ స్కీమ్కు రూ.1,231 కోట్లు,,డిస్కంల నష్టాల్లో 50 శాతం భరిస్తున్న రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల కోసం ఉదయ్ పథకం కింద రూ.1,231.04 కోట్ల నిధులను శాంక్షన్ చేసింది. గురువారం ఈ మేరకు ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సహాయం 2024-–-25 ఆర్థిక సంవత్సరం కోసం డిస్కమ్స్ ఆపరేషనల్ నష్టాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 

ఉదయ్​ స్కీమ్​లో భాగంగా డిస్కమ్​ల నష్టాలను 50% వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిం చాల్సి ఉంటుంది. గత 2024–25 సంవత్సరం సదరన్​డిస్కం నష్టాలు రూ.1,102.88 కోట్లు, నార్తర్న్​ డిస్కం నష్టాలు  రూ.1,359.19 కోట్ల చొప్పున మొత్తం రూ.2,462.07 కోట్లు కాగా.. ఈ మొత్తంలో 50 శాతం నష్టాలకు సంబంధించి రూ.1,231.04 కోట్ల నిధులను మంజూరు చేసింది.