2029 నాటికి 500 ఎస్ఎంఈలు..ఐదు రెట్ల వృద్ధి..తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇదే

2029 నాటికి 500 ఎస్ఎంఈలు..ఐదు రెట్ల వృద్ధి..తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇదే
  • టై హైదరాబాద్​తో రాష్ట్ర పరిశ్రమల శాఖ కీలక ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2029 నాటికి 500 అత్యున్నత స్మాల్, మీడియం ఎంటర్​ప్రైజ్ (ఎస్ఎంఈ)లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టై హైదరాబాద్‌‌తో రాష్ట్ర ప్రభుత్వం (ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్) కీలక ఒప్పందం చేసుకుంది. ఆ 500 కంపెనీలను ఐదు రెట్ల వృద్ధితో ముందుకు తీసుకెళ్లేలా టై, ఇండస్ట్రీస్ శాఖలు కలిసి పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలను గుర్తించి.. వాటి అభివృద్ధికి పాటుపడనున్నాయి.

 దీంతో వచ్చే నాలుగేండ్లలో మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా. హైదరాబాద్‌‌లోని హైటెక్స్‌‌లో టై హైదరాబాద్ చాప్టర్‌‌కు చెందిన హైదరాబాద్ ఎంట్రప్రెన్యూరల్ ఎకోసిస్టమ్ కలెక్టివ్ ఆధ్వర్యంలో రెండు రోజుల హైదరాబాద్ ఎంట్రప్రెన్యూర్స్ సమిట్‌‌  శుక్రవారం  ప్రారంభమైంది.  ఈ సమిట్​లో 1,500 కంపెనీలు పాల్గొన్నాయి. 

సదస్సులో భాగంగా టీ–హబ్, టై హైదరాబాద్, హైసియా, ఎఫ్​టీసీసీఐ, టీజీ10ఎక్స్ వంటి సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.