గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‎లను సభ్యులుగా నియమించింది.  ప్రభుత్వ శాఖల స్పందనపై ఈ కమిటీ నివేదిక తయారు చేయనుంది. విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ తన నివేదికను అందించనుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గుల్జార్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‎ ఉన్నారని తెలిపారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ రిపోర్ట్ సమర్పిస్తోందని చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ తగు సూచనలు ఇస్తోందని పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి చర్యలు తీసుకుంటారని తెలిపారు. 

కాగా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‎లో  ఆదివారం (మే 18) ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైర్ యాక్సిడెంట్‎లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ ఘటననను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది.