సర్కారీ కొలువులు ఏమాయె..ఖాళీ పోస్టులు లక్షన్నర పైనే

సర్కారీ కొలువులు ఏమాయె..ఖాళీ పోస్టులు లక్షన్నర పైనే

హైదరాబాద్, వెలుగు:సొంత రాష్ట్రంలో గవర్నమెంట్​ జాబ్​లు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలింది. ఏటా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నా సర్కారు ఎట్లాంటి నియామకాలు చేపట్టడం లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్  స్వయంగా ప్రకటించారు. లక్షన్నర ఖాళీలనూ గుర్తించారు. కానీ ఇప్పటిదాకా భర్తీ చేసింది మొత్తం 58,240 పోస్టులే. ఇందులోనూ కొన్ని డిపార్ట్​మెంట్లలోనే ఎక్కువ పోస్టులు భర్తీ చేయగా.. కొన్నింటిలో అయితే ఒక్కరినీ నియమించలేదు. సుమారు రెండేండ్లుగా అయితే ఉద్యోగాల భర్తీ మొత్తంగా ఆగిపోయింది. నిరుద్యోగులు పోరాటాలు చేసినా, ఆందోళనలకు దిగినా సర్కారు పట్టించుకోవట్లేదు. రాష్ట్రం ఏర్పాటై ఆరేండ్లవుతున్నా ఒక్క గ్రూప్–1 పోస్టు కూడా భర్తీ చేయలేదు. ప్రైమరీ స్కూళ్ల నుంచి డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల ద్వారా అన్నిచోట్లా ఫ్యాకల్టీ కొరత పట్టిపీడిస్తోంది. కేసీఆర్ కిట్ పథకంతో సర్కారీ హాస్పిటళ్లకొచ్చే రోగుల సంఖ్య పెరిగినా.. డాక్టర్లు, మెడికల్​ స్టాఫ్​ను నియమించలేదు. అసలు ఏటా సర్కారీ కొలువులు భర్తీ చేస్తమని సీఎం కేసీఆర్ చాలాసార్లు ప్రకటించారు. కానీ

అమల్లోకి రాలేదు.లక్ష ఉద్యోగాలు ఖాళీయే..

రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో లక్షా 51 వేల 116 ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అందులో ఇప్పటివరకు 58,240 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. అంటే సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీయే. వాటికి తోడు ప్రతి నెలా రిటైర్మెంట్లతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు టీఎస్​పీఎస్సీ ద్వారా 29,091 ఉద్యోగాలు, పోలీస్​ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 10,980 పోస్టులను భర్తీ చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్లో 1,514 మందిని, 9,355 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించారు. గురుకులాల రిక్రూట్​మెంట్ బోర్డు కింద 7,300 పోస్టులు భర్తీ చేశారు. గురుకులాల్లో ఇంకా 5 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో నియామక ప్రక్రియకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న విమర్శలున్నాయి.

డిపెండెంట్లు, ఆర్టిజన్లూ కొత్త పోస్టులేనా?

ఆర్టీసీ, సింగరేణి, కరెంటు సంస్థల్లో భర్తీ చేసిన డిపెండెంట్, ఆర్టిజన్ పోస్టులను కూడా సర్కారు కొత్త నియామకాలుగా లెక్క చూపుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. డిపెండెంట్ కింద సింగరేణిలో 6,029 మందిని, ఆర్టీసీలో 1,137 మందిని నియమించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తోన్న 4,020 మందిని రెగ్యులర్ చేశారు. ఇక విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ హోదాలో 27,026 సిబ్బంది పనిచేస్తున్నారు. వారు రెగ్యులర్ ఎంప్లాయిస్ కాదు. కానీ ఏటా ఫిక్స్​డ్​ శాలరీ పొందుతున్నారు.

సర్కారు తీరుతో న్యాయ వివాదాలు

ఏ ఉద్యోగం ఎలా భర్తీ చేయాలనే దానిపై సరైన క్లారిటీ లేకపోవడంతో జారీ అయిన నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదంలో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ చేపట్టిన 5,916 పోస్టుల భర్తీ మధ్యలో నిలిచిపోయింది. ఇందులో గురుకులాల్లోని టీజీటీ పోస్టులు1,419, పారా మెడికల్ ఉద్యోగాలు 4,207, పారా మెడికల్ వెయిటేజీ వివాదంతో 290 పోస్టుల భర్తీకి అడ్డంకి ఏర్పడింది.

గ్రూప్-1 జాడే లేదు

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్–-1 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. గత టెర్మ్​లో 128 గ్రూప్ –1 ఖాళీల భర్తీ పనిని టీఎస్​పీఎస్సీకి అప్పగించినా.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ముందుకుపడలేదు. కొత్త జోన్ల ప్రకారం భర్తీ చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. ఏ పోస్టు ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్నది తేల్చలేదు. టీఎస్‌పీఎస్సీ ఎన్నిసార్లు కోరినా స్పందన లేదు. ఇక గ్రూప్–3 లో దాదాపు 306 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి భర్తీకి కొత్త రోస్టర్ సిస్టం అవసరం. ఆ విషయంగా సర్కారు నుంచి చొరవ లేదు.

ఏడాదిన్నరలో 7 వేల మంది రిటైర్

2018 డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి ఇప్పటివరకు 7 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. మండల కేంద్రం నుంచి సెక్రటేరియట్ వరకు వివిధ డిపార్ట్​మెంట్ల పరిధిలో ప్రతి నెలా 500 మంది వరకు రిటైర్ అవుతున్నారు. దాంతో ఆఫీసులు ఖాళీ అవుతున్నాయి. గతంలో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు తీసుకునేవారని.. మలి ప్రభుత్వంలో అలాంటి పనేదీ జరగడం లేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కీలకమైన రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లు సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో దాదాపు 4 వేల మంది సిబ్బంది అవసరమని ఆ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇక రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ పదే పదే అంటుండటంతో ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ డౌటేనని పేర్కొంటున్నాయి.

డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో వేలాది పోస్టులు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. వాటిల్లో దాదాపు 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో 1,500 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వాటి భర్తీపై సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని వర్సిటీల అధికారులు చెప్తున్నారు.

ఆరేండ్లలో టీఎస్​పీఎస్సీ నియామకాలివీ..

నోటిఫికేషన్లు                            104

భర్తీ చేపట్టిన పోస్టులు                  29,091

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దశలో..      1,636

న్యాయ, ఇతర వివాదాల్లో..          5,916

రాష్ట్రంలో ఖాళీ పోస్టుల అంచనా

శాఖ                                       ఖాళీలు

రెవెన్యూ                                    5 వేలు

ఫారెస్ట్​                                      4 వేలు

హెల్త్​                                        9 వేలు

ఇరిగేషన్                                  4 వేలు

పోలీసు శాఖ                             22 వేలు

గురుకులాలు                             4 వేలు

యూనివర్సిటీలు                        2 వేలు

డిగ్రీ, జూనియర్,
పాలిటెక్నిక్ కాలేజీలు                  7 వేలు

వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు      11 వేలు

ప్రభుత్వ టీచర్లు                         35 వేలు

మొత్తం                                 1,03,000

వచ్చే యేడు సగం సెక్రటేరియట్  ఖాళీ

2021 నాటికి సెక్రటేరియట్​లో సగం మందే మిగులుతారని అధికారవర్గాలు అంటున్నాయి. సెక్రటేరియట్లో మొత్తం 3,500 మంది రెగ్యులర్​ ఉద్యోగులు ఉండగా.. ఇప్పటికే దాదాపు 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా రిటైర్మెంట్లు పెరుగుతున్నా కొత్త నియామకాల్లేవు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా పనిచేయిస్తున్నారు.

ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట వెట్టిచాకిరి

తెలంగాణ వచ్చే నాటికే లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారే ప్రకటించింది. ఆరేండ్లు అవుతుంది. ఈ టైంలో మరో లక్ష పోస్టులు ఖాళీ అయ్యాయి. వెంటనే 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకూ వెంటనే నోటిఫికేషన్స్​ఇయ్యాలె. ప్రస్తుతం అన్ని డిపార్ట్​మెంట్లలో ఖాళీలున్నా.. కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్  నియామకాలు చేస్తున్నారు. ఇదంతా వెట్టిచాకిరి చేయించుకోవడమే.

– నర్సిరెడ్డి, టీచర్​ ఎమ్మెల్సీ

20 వేల టీచర్ పోస్టులు ఖాళీ

రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వచ్చాక 8,742 పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్​ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. కనీసం మేనేజ్​మెంట్ల వారీగా అయినా ప్రమోషన్లు ఇవ్వాలని కోరినా సర్కారు పట్టించుకోవడం లేదు.

– సదానందంగౌడ్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు?

తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు కేసీఆర్ మొండి చెయ్యి చూపించారు. వేల పోస్టులు ఖాళీ అవుతున్నా భర్తీ చేయడం లేదు. నాన్ టెక్నికల్ పోస్టులను కూడా ఫిల్​ చేయడం లేదు. తెలంగాణ సివిల్ సర్వీస్ అని చెప్పిన కేసీఆర్.. పట్టించుకోవడమే లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ పోస్టులు మంజూరు చేయలేదు. టీచర్ల భర్తీకి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

– ప్రవీణ్ రెడ్డి, ఓయూ రీసెర్చ్ స్కాలర్