8వ విడత హరిత హారం.. మొక్కలు సిద్ధం చేయండి

8వ విడత హరిత హారం.. మొక్కలు సిద్ధం చేయండి

వికారాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జులైలో నిర్వహించనున్న 8వ విడత హరితహారానికి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలోని డీపీఆర్సీ బిల్డింగ్​లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులతో  నర్సరీల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మోతిలాల్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా నర్సరీల్లో గ్రీన్ షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలన్నారు.   ప్రతి గ్రామ పంచాయతీలో  రోజుకు కనీసం 100 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేసేలా చూడాలన్నారు.  ఉపాధి హామీ  కింద చేపట్టిన  పనులకు సంబంధించిన అన్ని బిల్లులు క్లియర్ చేయాలన్నారు.  సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.