
హైదరాబాద్, వెలుగు: గిరిజనుల ఆరాధ్యుడు కుమ్రం భీమ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7న అశ్వయుజ పౌర్ణమి నాడు కుమ్రం భీమ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం తరఫున అధికారికంగా జరపాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.