మహబూబ్‌నగర్/గద్వాల, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయిని సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. వీరి స్థానంలో మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా, నారాయణపేట కలెక్టర్‌గా ప్రదీప్ జైన్ నియమితులయ్యారు. జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్‌ను ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్న రిజ్వాన్ భాషా షేక్‌ను గద్వాల కొత్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
