
రాష్ట్ర గవర్నర్ తమిళిసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ కు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీపావళి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్. మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.