- ఎమ్మెల్యేలు విజయ రమణా రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అపాయింట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీకి ముగ్గురు, కౌన్సిల్‌కు ఇద్దరు చొప్పున విప్‌లను ప్రభుత్వం నియమించింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం మేరకు సీఎస్ రామకృష్ణా రావు గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీ విప్‌లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియమితు లయ్యారు. శాసన మండలి విప్‌లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అపా యింట్ అయ్యారు. కాగా, అసెంబ్లీ, కౌన్సిల్‌లో కీలక బిల్లులపై చర్చ సాగుతున్న సమయంలో సొంత పార్టీ సభ్యులు సభకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత విప్‌లపై ఉంటుంది.
