హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన రైతు కమిషన్‌కు సభ్యులను నియమించింది. మొత్తం ఏడుగురిని రైతు కమిషన్ సభ్యులుగా నియమిస్తూ ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 21) వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీ, న్యాయవాది సునీల్, రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గంగాధర్‌లను కమిషన్ మెంబర్లుగా అపాయింట్ చేసింది.
ALSO READ | పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
కాగా, 2024, సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రైతు కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ పగ్గాలు అప్పగించింది. తాజాగా.. రైతు కమిషన్‌కు ఏడుగురు సభ్యులను నియమించింది.