
- మొత్తం ఆరుకు చేరిన మెంబర్ల సంఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కు మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఆడిట్ సెల్ డిపార్ట్ మెంట్ లో సీనియర్ ఆఫీసర్గా ఉన్న చంద్రకాంత్ రెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్ విశ్వప్రసాద్, ఓయూ ప్రొఫెసర్ బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ను అపాయింట్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు జీఓ నంబర్ 198 రిలీజ్ చేశారు.
వీరి కాలపరిమితి ఆరేండ్లు లేదా 62 ఏండ్ల వయస్సు నిండే వరకూ పదవిలో కొనసాగుతారు. విశ్వప్రసాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తుండగా, లక్ష్మీకాంత్ రాథోడ్ గతంలో పాలమూరు వీసీగా పనిచేశారు. కాగా.. ప్రస్తుతం టీజీపీఎస్సీలో అమీర్ ఉల్లాఖాన్, నర్రి యాదయ్య, పాల్వాయి రజని కుమారి సభ్యులుగా ఉన్నారు. కొత్తగా మరో ముగ్గురు రావడంతో సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. గత నెల 13న ‘టీజీపీఎస్సీలో ముగ్గురే’ శీర్షికతో వీ6 వెలుగు దినపత్రిక సమస్యను సర్కారు దృష్టికి తీసుకుపోయింది.