జీవో 111పై కమిటీ ..రిపోర్ట్ రావాల్సి ఉంది

జీవో 111పై కమిటీ ..రిపోర్ట్ రావాల్సి ఉంది

హైదరాబాద్, వెలుగు: జీవో 111లో సడలిం పు అంశాలపై స్టడీ చేసేందుకు ఆఫీషియల్ కమిటీ రిపోర్టు రావాల్సి ఉందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. రిపోర్టు వచ్చే దా కా జీవో 111లోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని హామీ ఇచ్చింది. 

జీవో 111పై దాఖలైన పలు పిటిషన్లను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్​తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. అడిషనల్ ఏజీ రామచందర్ రావు వాదిస్తూ.. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ పరివాహక ప్రాంతాల్లో పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీల నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు 1996లో 84 గ్రామాలకు సంబంధించిన జీవో 111 ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం అధ్యయన కమిటీ వేసిందని, రిపోర్టు రావాల్సి ఉందన్నారు. వాదనల తర్వాత తదుపరి విచారణను డివిజన్ బెంచ్ 2 వారాలకు వాయిదా వేసింది.