ఉద్యోగులకు 2.73 శాతం డీఏ

ఉద్యోగులకు 2.73 శాతం డీఏ
  • మంజూరు చేస్తూరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • 8 విడతల్లో బకాయిల చెల్లింపులు
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు ఒక డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2.73 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్​ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ.. 20.02 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయంతో 2021 జులై 1 నుంచి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. పెరిగిన డీఏను పెన్షనర్లకు జనవరి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి ఫిబ్రవరిలో ఇవ్వనున్నట్టు సర్కారు తెలిపింది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు బకాయిలను 8 విడతల్లో చెల్లించనున్నట్టు వెల్లడించింది. ఇంకో రెండు డీఏలు ఎప్పుడన్నది సర్కార్ ప్రకటించలేదు. మార్చి తర్వాత ఇస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.