ప్రభుత్వ దవాఖాన్లలో సఫాయి చార్జీల పెంపు

ప్రభుత్వ దవాఖాన్లలో సఫాయి చార్జీల పెంపు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సఫాయి చార్జీలను రాష్ట్ర సర్కార్‌‌‌‌ పెంచింది. ఒక్కో బెడ్డు వద్ద చేసే పారిశుధ్య ఖర్చును రూ.5 వేల నుంచి రూ.7,500కు పెంచుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హాస్పిటళ్లతో పాటు నర్సింగ్‌‌ స్కూళ్లు, హాస్టళ్లకు కూడా ఇదే వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. 200 కంటే ఎక్కువ బెడ్లు ఉన్న హాస్పిటళ్లకు వేర్వేరుగా టెండర్లు పిలిచి, కాంట్రాక్ట్‌‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 200 కంటే తక్కువ బెడ్లు ఉన్న హాస్పిటళ్లను గ్రూపులుగా విభజించి, వాటికి వేరుగా టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. టెండర్ల బాధ్యత, కాంట్రాక్టర్లతో పని చేయించే బాధ్యతను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే హెల్త్‌‌ సొసైటీలకు అప్పగించారు. హాస్పిటల్‌‌లోని ఓపెన్ ఏరియాలో ప్రతి 27 వేల చదరపు అడుగులకు ఒక వర్కర్, హాస్పిటల్‌‌ లోపల చేసే పనికి ప్రతి 7 వేల చదరపు అడుగులకు ఒక వర్కర్‌‌‌‌ను నియమించాలని పేర్కొన్నారు. కాగా, హాస్పిటళ్లలో పేషెంట్‌‌ బెడ్డు వద్ద నీట్‌‌గా ఉంచే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లపైనే ఉంటుంది. కార్మికుల జీతాల  విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.