త్వరలో టెట్ నోటిఫికేషన్​.. మే లో పరీక్ష

త్వరలో టెట్ నోటిఫికేషన్​.. మే లో పరీక్ష
  •    2011 ‑ 2017 మధ్య పాసైన వాళ్లకు ప్రయోజనం
  •    ఎన్ సీటీఈ ఆదేశాల మేరకు టెట్ అర్హతల్లో మార్పులు
  •     టెట్ పేపర్‌-1 కు బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే
  •     ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ చేసినోళ్లూ పోటీ పడొచ్చు
  •     ఒకటీ  రెండు రోజుల్లో నోటిఫికేషన్​.. మే లో పరీక్ష


హైదరాబాద్​, వెలుగు: టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌‌) నిర్వహణకు సెకండరీ స్యూల్​ ఎడ్యుకేషన్​కు రాష్ట్ర సర్కార్​ అనుమతిచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్​ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్ సీటీఈ) ఆదేశాల మేరకు టెట్ అర్హతల్లో మార్పులు చేసింది. ఈ సారి టెట్ పేపర్‌‌–-1కు బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు ఇకపై బీఈడీ అభ్యర్థులు కూడా అర్హత పొందనున్నారు. అయితే వీళ్లు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రైమరీ ఎడ్యుకేషన్లో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని నిబంధన విధించారు. ఎన్‌‌సీటీఈ మార్గదర్శకాల మేరకు టెట్‌‌ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించింది. ఫలితంగా 2011 నుండి 2017 వరకు నిర్వహించిన టెట్ లు ఇకపై లైఫ్ టైం వ్యాలిడిటీ పొందాయి. ఈ నిర్ణయం వల్ల 50 వేల మందికి లబ్ది చేకూరనున్నది. ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, మేలో పరీక్ష నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాటు చేస్తోంది.