కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించం

కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించం
  • సుప్రీంలో రాష్ట్ర సర్కారు పిటిషన్​

హైదరాబాద్, వెలుగు : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం  2021లో ఇచ్చిన గెజిట్​ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రెండు వారాల కిందట సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు రిట్​పిటిషన్​ను దాఖలు చేసింది.

 ఆ పిటిషన్ ను జస్టిస్ సంజయ్​ఖన్నా, జస్టిస్​సంజయ్​కుమార్​లతో కూడిన బెంచ్ విచారించాల్సి ఉంది. అయితే, బెంచ్​లో జస్టిస్​సంజయ్​కుమార్​ తెలుగు రాష్ట్రాల కేడర్​కు చెందిన వ్యక్తి కావడంతో.. పిటిషన్​ను విచారించలేమని బెంచ్​స్పష్టం చేసింది. మరో బెంచ్​కు పిటిషన్​ను బదిలీ చేస్తామని పేర్కొంది. ఈ పిటిషన్​దీపావళి తర్వాత మరో బెంచ్​విచారించే అవకాశం ఉంది.