ఎలక్షన్లలో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తం

ఎలక్షన్లలో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తం
  • తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్

బషీర్​బాగ్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకురావడంపై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ అసోసియేషన్​ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి తాము అండగా నిలుస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రచారం చేసి కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు.