
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో శుభారంభం చేశాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో అర్జున్ 37 ఎత్తులతో ఫ్రెడరిక్ సవానె (జర్మనీ)పై గెలిచాడు. తెల్ల పావులతో ఆడిన తెలంగాణ ప్లేయర్.. క్వీన్ గాంబిట్ వ్యూహంతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. సవానె డిఫెన్స్ స్ట్రాటజీతో ముందుకొచ్చినా సమయానుకూలంగా ఎత్తులు వేసిన అర్జున్ ఈజీగా నిలువరించాడు.
పెంటేల హరికృష్ణ.. హెన్రిక్వెజ్ క్రిస్టోబాల్ (చిలీ), గుకేశ్.. రవూఫ్ మమదెవ్ (అజర్‌బైజాన్), ప్రజ్ఞానంద.. అర్యన్ చోప్రా మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. విమెన్స్ తొలి రౌండ్‌లో ఆర్. వైశాలి.. ఒలివియా కిలోబాసా (పోలెండ్)పై, సవితా శ్రీ.. మార్సెల్ ఎఫ్రోమిస్కి (ఇజ్రాయిల్)పై, దివ్య దేశ్‌ముఖ్.. త్రిషా కన్యామరాలా (ఐర్లాండ్)పై గెలవగా, తానియా సచ్‌దేవ్.. ద్రోణవల్లి హారిక మధ్య గేమ్ డ్రా అయ్యింది.