నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల

 

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024, ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • 2024, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అవకాశం ఉంది.
  • హాల్ టికెట్ డౌన్ లోడ్.. పరీక్ష ఏడు రోజుల ముందు నుంచి ఎగ్జామ్ ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందు వరకు అవకాశం ఉంటుంది.
  • గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నారు. ఏ తేదీ అనేది తర్వాత ప్రకటించనుంది టీఎస్పీఎస్సీ.
  • గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ 2024, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఉండనుంది. 
  • గతంలో అప్లయ్ చేసిన వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
  • https://www.tspsc.gov.in/