గ్రూప్​ 1  ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ ప్లాన్​

గ్రూప్​ 1  ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ ప్లాన్​

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి భారీగా18 విభాగాల్లో 503 గ్రూప్​1 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది.  రాష్ట్ర స్థాయిలో ఉన్నత సర్వీసుల్లో చేరేందుకు ఇదో మంచి అవకాశం. మే 31 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ రద్దుతో రెండంచెల్లో(ప్రిలిమ్స్, మెయిన్స్‌‌‌‌‌‌‌‌) జరగనున్న ఈ పరీక్షకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో విజేతగా నిలవాలంటే ముందు ప్రిలిమ్స్ గట్టెక్కాలి. ​ ఇందులో సిలబస్ ప్రకారం ఏ టాపిక్స్ ఇంపార్టెంట్​..​ ఏమేం చదవాలి,  ఏవి చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో తెలుసుకుందాం...

కరెంట్ ఎఫైర్స్ అండ్​ ఇంటర్నేషనల్​ రిలేషన్స్​ 

అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ ఎఫైర్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలి. పరీక్షకు ముందు ఆరు నెలల కరెంట్ ఎఫైర్స్‌‌‌‌‌‌‌‌పై  పూర్తి అవగాహన ఉండాలి. సమకాలీన అంశాలతో పాటు జియో పొలిటికల్ ప్రాధాన్యత ఉన్న అంశాలను జాగ్రఫీ కోణంలో ప్రిపేర్​ అవ్వాలి. ఉదాహరణకు ఉక్రెయిన్​ ఏ దేశాలతో సరిహద్దు ఉంది లాంటివి. అంతర్జాతీయ సంబంధాలపై కనీసం 5 ప్రశ్నలుండే అవకాశముంటుంది. యూఎన్​ఓ, నాటో పాత్ర, వాటి ఏర్పాటుకు గల ఉద్దేశాలు, లక్ష్యాల మీద అవగాహన ఉండాలి. ఉక్రెయిన్​–రష్యా వార్​తో ముడిపడి ఉన్న అంతర్జాతీయ సంబంధాలు, భద్రతా మండలిలో ఓటింగ్​ లాంటి అంశాలన్నీ ప్రశ్నలుగా అడిగే ఛాన్స్​ ఉంటుంది.

డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ 

ఎన్విరాన్​మెంట్​, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అన్ని పరీక్షల్లోనూ ఇప్పుడు కీలకంగా మారింది. విపత్తు నిర్వహణ కోసం 8, 9, 10వ తరగతి ఎన్​సీఈఆర్​టీ బుక్స్​ ప్రిపేర్​ అవ్వాలి. పర్యావరణ సదస్సులు, ఇటీవల సంభవించిన విపత్తుల గురించి తెలుసుకోవాలి.  

భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి:

వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, సూక్ష్మ అర్థ శాస్త్రం, స్థూల అర్ధ శాస్త్రం, ప్రణాళికలు, నీతి అయోగ్​, ఆర్థిక సంస్కరణలు, బడ్జెట్, గ్రామీణాభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపారం, దేశ ఆర్థిక వ్యవస్థ. జనాభా టాపిక్ లను చదవాలి. జీడీపీ, జీఎస్​డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం నుంచి తప్పనిసరి ప్రశ్నలుంటాయి.  2021–22 ఎకనమిక్​ సర్వే రిపోర్టు, బడ్జెట్ పై  పట్టు సాధించాలి. కొత్తగా ప్రభుత్వ ం తీసుకొచ్చిన పథకాలపై ఫోకస్​ చేయాలి. 

జాగ్రఫీ

భూ స్వరూపం, శీతోష్ణ స్థితి,  గ్రహాలు వాటి స్థితి, స్వభావం, సముద్రాలు నదులు, తీరాలు–పొడవు విస్తీర్ణం లోతు తదితర అంశాలు, దీవులు, దేశాలు, రాష్ట్రాల సరిహద్దుల నుంచి తప్పనిసరి ప్రశ్నలుంటాయి. తెలంగాణ, భారత దేశ భూగోళ శాస్త్రాలే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్​, చైనా, జపాన్, అస్ట్రేలియా తదితర దేశాల భౌగోళిక అంశాలు చదువుకోవాలి. జాగ్రఫీకి​ మ్యాప్​ ఓరియెంటెడ్​ ప్రిపరేషన్​ ముఖ్యం. 7 నుండి 10 తరగతుల వరకు ఎన్​సీఈఆర్​టీ  పాఠ్యపుస్తకాలను తప్పనిసరిగా చదవాలి.  

భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి

పురాతన, మధ్య యుగ, ఆధునిక చరిత్రను చదవాలి. కాలాలకు అనుగుణంగా అప్పటి  సంస్కృతి, సాంస్కృతిక సేవల, అభివృద్ధి, ఆదరణపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. ప్రాచీన భారత దేశ చరిత్రలో పూర్వ చారిత్రక సంస్కృతులు, సింధూ నాగరికత, లోహ యుగం, వేద కాలం నాటి ఆర్య నాగరికత, జైన బౌద్ధ మతం, మగధ, మౌర్య, శుంగ, కణ్వ వంశాలు, ఇండోగ్రీకులు, కుషాణులు, ఖార వేలుడు, శాతవాహనులు. సంగ యుగం, గుప్తులు, హర్ష వర్ధణుడు, చాళుక్యులు, పల్లవుల నుంచి ముఖ్యమైన అంశాలు కవర్​ చేయాలి. మధ్య యుగ చరిత్రలో రాజపుత్రులు, రాష్ట్ర కూటులు, చోళుల నుంచి మహారాష్ట్రులు శివాజీ వరకు టాపిక్స్​ ఉంటాయి. భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, ఇండో ఇస్లామిక్​ సంస్కృతి నుంచి తప్పనిసరి ప్రశ్నలుంటాయి. . విజయనగర సామాజ్ర్యం, బహమనీ, దక్కన్​ ముస్లిం, మొగల్​ సామ్రాజ్యం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగి ఛాన్స్​ ఉంది. ఐరోపా వాసుల ఆగమనం నుంచి బ్రిటిష్​ సామ్రాజ్యం, జాతీయ ఉద్యమం, స్వాతంత్య్రానంతర పరిణామాల వరకు చరిత్ర నుంచి లోతైన ప్రశ్నలే అడుగుతారు.

పాలిటీ అండ్​ గవర్నెన్స్​ 

ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ సబ్జెక్ట్​ సమకాలీన అంశాలను జోడిస్తూ ప్రిపరేషన్​ కొనసాగించాలి.  భారత రాజ్యాంగ నిర్మాణం, రచన, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేబినేట్​, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి, గవర్నర్​, 73, 74 రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థల, న్యాయ వ్యవస్థ, జాతీయ కమిషన్లు, రాజ్యాంగ సవరణలు. అత్యవసర అధికారాలు.. రాజకీయ పార్టీలు, పౌరసత్వం.. ఈ టాపిక్స్​ క్రమ పద్ధతిలోచదువుకోవాలి.  పరిపాలనా, ప్రభుత్వ వ్యవస్థలు, నిర్మాణం, ఆవిర్భావం, చారిత్రక నేపథ్యం, భారతదేశ పాలన, స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాజ్యాంగ వ్యవస్థల మీద అవగాహన పెంచుకోవాలి.

తెలంగాణ సమాజం, సంస్కృతి, కళలు, సాహిత్యం

తెలంగాణ చారిత్రక పూర్వ యుగం నుంచి శాతవాహనులు రాజకీయ చరిత్ర, ఇక్ష్వాకుల సంస్కృతి, విష్ణుకుండినుల సాంస్కృతిక సేవ, జైన, బౌద్ధ, శైవ మతాల అభివృద్ధి ఆదరణ, బాదామి చాళుక్యుల సాహిత్య శిల్ప కళాసేవ, కాకతీయులు బ్రహ్మనీ రాజ్యం సాంస్కృతిక సేవ, మొఘల్స్​ పాలనలో కళలు, సాహిత్యం కీలకంగా చదవాలి. అసఫ్​జాహీలు, నిజాం రాజులు, తెలంగాణ సంస్కృతి, పండుగలు, కళలు, తెలంగాణ కవులు సాహిత్యం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలతో ప్రిపేర్​ అవ్వాలి.

తెలంగాణ రాష్ట్ర విధానాలు

తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ ఒకసారి అవలోకనం చేయాలి. ఉచిత విద్యుత్​, రైతు బంధు నుంచి కళ్యాణ లక్ష్మి రైతు బీమా, టీ ప్రైడ్​, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ.. దళిత బంధు వరకు.. వరుసగా అన్ని స్కీములు.. స్కీమ్​ లక్ష్యం.. ఎవరికి ఉద్దేశించింది..   ఎక్కడ ప్రారంభించారనే  కోణాల్లో చదువుకోవాలి. ప్లాన్​ ప్రకారం ప్రిపేర్​ అయితే ఈ టాపిక్​ నుంచి ఈజీగా మార్కులు స్కోర్​ చేసే ఛాన్స్​ ఉంది.  

సోషల్​ ఎక్స్​క్లూషన్స్​

భారతీయ సమాజం, నిర్మాణం, సామాజిక హక్కులు, అంటరానితనం, వివక్ష, కులాలు, గిరిజనులు వికలాంగులు, వీటికి సంబంధించిన సామాజిక ఉద్యమాలు, హక్కులు, సామాజిక దురాచారాలను పారదోలేందుకు అమలైన విధానాలు. ఈ టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

రీజనింగ్ అండ్​ డేటా ఇంటర్‌‌‌‌‌‌‌‌ప్రెటేషన్

దిశలు, కాలం, వయస్సులు, క్యాలెండర్​, స్థాన అమరికలు,  షరతులు, రక్త సంబంధాలు, కోడింగ్​ డీకోడింగ్, ర్యాంకింగ్​ వరుసలు, లాజికల్​ వెన్​ చిత్రాలు, స్థానాల అమరికలు, వీటికి సంబంధించిన ప్రశ్నలు అనలిటికల్​ ఎబిలిటీలో అడుగుతారు. బార్ గ్రాఫ్​లు, పై గ్రాఫ్​లు, చార్టులు, దత్తాంశ విశ్లేషణ, సగటు, నిష్పత్తికి సంబంధించిన ప్రశ్నలు డేటా ఇంటర్​ ప్రెటేషన్​లో వస్తాయి. ప్రతి రోజు కొంత సమయం కేటాయించి ప్రాక్టీస్​ చేస్తేనే ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్​ చేయవచ్చు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

సైన్స్​ అండ్​ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలపైనే ఎక్కువగా ఫోకస్​ ఉంటుంది. అణురంగం, రక్షణ రంగం, అంతరిక్ష రంగం.. ఉదాహరణకు బ్రహ్మోస్​, చంద్రయాన్​ లాంటి అప్​డేటెడ్​ అంశాల నుంచి  ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, బయో టెక్నాలజీ,  క్లోనింగ్​, హెల్త్​​ టెక్నాలజీ, అగ్రికల్చర్​ టెక్నాలజీ అంశాలు ఇక్కడ కవర్​ చేయాలి. 6 నుంచి 10వ తరగతుల సీబీఎస్​ఈ/ఎన్​సీఈఆర్​టీ సైన్స్ టెక్స్ట్ బుక్స్​ చదవాలి. అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. సమకాలీన సైన్స్​ అండ్​ టెక్నాలజీ నుంచి 8 నుండి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా స్పేస్​ టెక్నాలజీ, రోబో, నానో, డిఫెన్స్​, బయోటెక్నాలజీగా విభజించుకొని చదవాలి. ఇస్రోతో పాటు అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలపై కూడా అవగాహన పెంచుకోవాలి.

60 డేస్​ స్ట్రాటజీ

నోటిఫికేషన్​లో పేర్కొన్నట్లు గ్రూప్‌‌‌‌‌‌‌‌ 1 ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌ జూలై/ఆగస్టులో నిర్వహించనున్నారు కాబట్టి అభ్యర్థులు మే/జూన్‌‌‌‌‌‌‌‌లోగా అన్ని అంశాలను చదివేలా 60 రోజుల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్​ రూపొందించుకోవాలి. మిగతా సమయాన్ని రివిజన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించాలి. ప్రిలిమ్స్​ సిలబస్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న అంశాల్లో ఒకేవిధమైన వాటిని కలిపి చదవాలి. ఉదాహరణకు కరెంట్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌ చదివేటప్పుడు సిలబస్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర విధానాలు; గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌, పబ్లిక్‌‌‌‌‌‌‌‌ పాలసీ; అంతర్జాతీయ సంబంధాలు, ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా కలిపి చదవాలి. సోషల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌క్లూషన్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టులో మహిళ‌‌‌‌‌‌‌‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు సంబంధించిన రాజ్యాంగ అంశాలూ ఉంటాయి కాబట్టి భారత రాజ్యాంగం, పాలిటీని దీంతో కలిపి చదవాలి. సైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, జాగ్రఫీ అంశాలను ఒక విభాగంగా, సైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలను మరో విభాగంగా చదవాలి. పర్యావరణం, విపత్తు నిర్వహణ, జాగ్రఫీని ఒక విభాగంగా, భారతదేశ చరిత్రను తెలంగాణ సంస్కృతి, చరిత్రతో మరో విభాగంగా కలిపి చదివితే ప్రయోజనం ఉంటుంది. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కరెంట్‌‌‌‌‌‌‌‌ అఫైర్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానిస్తూ చదవాలి.  సిలబస్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక స్కోరింగ్‌‌‌‌‌‌‌‌ ఏరియా–లాజికల్‌‌‌‌‌‌‌‌ రీజనింగ్‌‌‌‌‌‌‌‌. దీన్ని అశ్రద్ధ చేయకుండా ఏకాగ్రతతో చదవాలి. అభ్యర్థులు రోజూ 10 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించాలి. అన్ని విభాగాలను ప్రతిరోజూ చదివేలా జాగ్రత్త వహించాలి. ఆబ్జెక్టివ్‌‌‌‌‌‌‌‌ విధానంలో ఉండే ప్రిలిమినరీ పరీక్షకు సైతం డిస్క్రిప్టివ్‌‌‌‌‌‌‌‌ విధానంతో ప్రిపరేషన్​ కొనసాగించాలి. ముఖ్యంగా ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న సిలబస్‌‌‌‌‌‌‌‌ అంశాల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మెయిన్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌‌‌‌‌లోనూ రిపీట్​ అయ్యేలా సిలబస్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీన్ని అభ్యర్థులు సానుకూలంగా మలచుకోవాలి.

బి.సైదులు
గోల్కొండ అకాడమీ, హైదరాబాద్​