గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : అధికారి వుటూరి శ్రీనాథ్

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : అధికారి వుటూరి శ్రీనాథ్

మంథని, వెలుగు: తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి గానూ 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమన్వయ అధికారి వుటూరి శ్రీనాథ్ మంగళవారం తెలిపారు. అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 చివరి తేదీ అని చెప్పారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని వివరించారు. 

ఈ పరీక్ష ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్, బీసీ, జనరల్ వెల్ఫేర్ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్‌‌‌‌గిరి ఫైన్ ఆర్ట్ స్కూల్ లో రాష్ట్రస్థాయి మెరిట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దగ్గర్లోని మీసేవ, ఇంటర్ నెట్ కేంద్రాలను సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు.