
హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొన్న అప్పటి పార్లమెంట్ సభ్యుడు, సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులో హాజరు మినహాయింపునిస్తూ మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు 2021లో పాత సచివాలయం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించడంపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ కె. లక్ష్మణ్ విచారించి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ నుంచి రేవంత్‌కు మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే, కింది కోర్టు ఆదేశాలిస్తే హాజరుకావాలన్నారు. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేశారు.