పని చేయని లీడర్లను నిలదీయండి: జస్టిస్‌ అమర్​నాథ్ గౌడ్

పని చేయని లీడర్లను నిలదీయండి: జస్టిస్‌ అమర్​నాథ్ గౌడ్

హైకోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్‌ అమర్​నాథ్ గౌడ్

పని చేయని ఆఫీసర్లు, లీడర్లను నిలదీయాలని.. అండగా మేముంటామని తెలంగాణ హైకోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్‌‌ టి.అమర్‌‌నాథ్‌‌ గౌడ్ ప్రజలకు సూచించారు. ఆదివారం తలమడుగు మండలం కుచాలాపూర్‌‌లో నిర్వహించిన న్యాయ సేవా సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు వాళ్లు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే ఎలాంటి న్యాయ సేవా సదస్సులు అవసరం లేదన్నారు. చట్టాలపై అవగాహన లేకనే చాలా సమస్యలు వస్తున్నందున ప్రజలందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన సరదాగా గుసాడి సంప్రదాయ అలంకరణలో కొంతసేపు కనిపించారు. ఆదివాసీలను గుసాడి గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సేవాధికార సంస్థ చొరవతో నిర్మించిన సీసీరోడ్డు, గ్రంథాలయం ప్రారంభించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు నెలకొల్పిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎంజి ప్రియాదర్శిని, ఇన్‌‌చార్జి ఐటీడీఏ గోపి, ఇన్‌‌చార్జి కలెక్టర్ ప్రశాంతి.ఎస్పీ విష్ణు వారియర్  తదితరులు పాల్గొన్నారు.