రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
  • జీవో జారీ చేసి ఆరేళ్లు దాటింది
  • ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్న పిటిషనర్

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలు రోజూ ఇబ్బందిపడాలా..? అని ప్రశ్నించింది. సిద్దిపేట సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి  దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటింది.. ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని పిటిషనర్ ఆరోపించారు. పలు జిల్లాల్లో రైతు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జీవోలు జారీ చేసి తర్వాత ప్రక్రియ వదిలేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. 

 

ఇవి కూడా చదవండి

బీజేపీకి జోష్.. పార్టీలో చేరిన  WWE  ద గ్రేట్ ఖలీ

లతా మంగేష్కర్ కు ఐక్య రాజ్య సమితి నివాళి
తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల