
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఐక్య రాజ్య సమితి జెనరల్ సెక్రటరీ అంటోనియో గుట్టెరస్ సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలని, ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. లతా మంగేష్కర్ మరణం తననెంతో బాధించిందన్నారు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు యూఎన్ఓ ఉన్నతోద్యోగి అనితా భాటియా. విదేశాల్లోని పలు భారతీయ సంఘాలు కూడా లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వెలిబుచ్చాయి.
ఇవి కూడా చదవండి:
మీరు చేసిన తప్పుకు రైతులను దొంగల్ని చేశారు
తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్