
తెలంగాణలో పటాకులు పై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న తెలంగాణ లో పటాకులు కాల్చివేతపై నిషేదం విధిస్తూ తెలంగాణ హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జీటీ (నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్) తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని పేర్కొంది. ఇక వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు పట్టణాల్లో బాణాసంచ పూర్తిగా నిషేధించాలని ఎన్జీటీ పేర్కొంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్లగొండ, పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకొవచ్చని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.