5 నుంచి హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్

5 నుంచి హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్
  • జూన్ 6 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: మే 5 నుంచి జూన్‌‌‌‌ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌ జనరల్‌‌‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5, 12 19, 26, జూన్‌‌‌‌ 2వ తేదీల్లో కేసుల ఫైలింగ్‌‌‌‌, మే 7, 14, 21, 28, జూన్‌‌‌‌ 4వ తేదీల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 

హెబియస్‌‌‌‌ కార్పస్‌‌‌‌, ముందస్తు బెయిల్‌‌‌‌, ట్రయల్‌‌‌‌ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్‌‌‌‌ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్‌‌‌‌ల వద్ద ఫైలింగ్‌‌‌‌ చేయొచ్చని చెప్పారు. లంచ్‌‌‌‌మోషన్‌‌‌‌, అత్యవసర పిటిషన్ల (విచారణ కోరడం)లపై డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ అడ్వకేట్ నిర్ణయం తీసుకుంటారు.