
హైదరాబాద్: రెవెన్యూ ట్రిబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపుల వాదనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. విచారణ లేకుండానే రెవెన్యూ ట్రిబ్యునళ్లు వివాదాలను తేలుస్తున్నాయన్న పిల్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ లేకుండా పరిష్కరించిన కేసులెన్నో తెలపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా పెండింగ్ కేసుల వివరాలు సమర్పించాలని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.