తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. సోమవారం (నవంబర్ 13) హైకోర్టుకు సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది.ఈ ఏడాది అధిక ఆషాఢ మాసం రావడంతో పండగలన్నీ కాస్త ఆలస్యంగా వస్తున్నాయి.అంతేకాదు తిథుల్లో తేడాతో ప్రతి పండగ ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళమే ఏర్పడింది. ఈ క్రమంలో 2023లో పండగ సెలవు దినాలను ప్రభుత్వాలు మార్పులు చేస్తూ వచ్చాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవును 12 నుంచి 13వ తేదీకి మార్చింది. ఈ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దీపావళి సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
