పట్టించుకోని హాస్పిటల్స్.. గర్భిణీ మృతిపై హైకోర్టు ఆగ్రహం

 పట్టించుకోని హాస్పిటల్స్.. గర్భిణీ మృతిపై హైకోర్టు ఆగ్రహం

మల్లాపూర్ గర్భిణీ మృతిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు హాస్పిటళ్లలోను ఆమెను చేర్చుకోకపోవడంపై ఫైర్ అయింది. ఆమె మృతిపై విచారణ జరిపి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సర్కార్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ లాగా రాష్ట్రంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని పేర్కొంది. బెడ్స్ సామార్థ్యంపై సర్కార్ వెబ్ సైట్ లో ఓ లెక్క ఉంటే... గ్రౌండ్ లెవల్ లో మరో సంఖ్య ఉందని తెలిపింది. ఉదయం లాక్ డౌన్ సడలింపుల టైంలో మార్కెట్లలో ఎక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించటం లేదని తెలిపింది హైకోర్టు.  ప్రైవేట్ హాస్పిటల్ చార్జీల పై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని హై కోర్టు ఆదేశించింది.