గుండెపోటుతో హైకోర్టు న్యాయమూర్తి మృతి

గుండెపోటుతో హైకోర్టు న్యాయమూర్తి మృతి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అనారోగ్యంతో మృతిచెందారు. దాంతో హైకోర్టు రీజిస్టర్ జనరల్ నేడు రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. కేశవరావు గుండెపోటుతో మృతిచెందారని వైద్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు మద్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.