ఎంపీ అర్వింద్ పై కేసు.. విచారణ వచ్చేనెలకు వాయిదా

ఎంపీ అర్వింద్ పై కేసు.. విచారణ వచ్చేనెలకు వాయిదా

హైదరాబాద్ / బంజారాహిల్స్, వెలుగు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోరాదని జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్‌‌‌‌ బుధవారం ఆదేశించారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లా మండలపేట పోలీసులు అర్వింద్​పై ఎస్పీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారు. దీనిని కొట్టేయాలని ఆయన బుధవారం లంచ్‌‌‌‌ మోషన్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసర విచారణగా చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

బంజారాహిల్స్​లో కేసు
ఈ నెల 3న బంజారాహిల్స్​లోని  తన నివాసంలో పోలీసులపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఎంపీ అర్వింద్​పై బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర పోలీస్ స్టేషన్‌లో బుధవారం కంప్లైంట్ చేశారు.  ‘‘ఐపీఎస్ అధికారులు, మీ పోలీసుల లాఠీలు ఏం పీకుతున్నాయి? మీ లాఠీలు పనిచేయట్లేదా? మీ లాఠీలు లంచాలు తీసుకుంటున్నాయా? మీరు, మీ డిపార్ట్ మెంట్ చెంచాగిరి చేస్తున్నారు?”అంటూ కామెంట్స్ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీ 294, 504, 5051(1),(b)  సెక్షన్ల కింద అర్వింద్​పై కేసు నమోదు చేశారు.