వెంటనే ఆపండి.. రాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్

వెంటనే ఆపండి.. రాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్

రాపిడో సంస్థకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించేలా తీసిన రాపిడో బైక్ రైడ్ ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని రాపిడోను ఆదేశించింది. యూ ట్యూబ్‌ లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని హెచ్చరించింది. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల రాపిడో బైక్ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ తో పాటు.. రాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు గానూ..హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు అధికారులు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్‌ నటించిన రాపిడో ప్రకనటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న రాపిడో  ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.‌ అయితే.. ఈ కేసులో.. తాజాగా తెలంగాణ హై కోర్టు రాపిడో సంస్థకు  షాక్‌ ఇచ్చింది. వెంటనే ఆ ప్రకటల్ని తొలగించాలని ఆదేశించింది. మరి కోర్టు ఆదేశాలపై రాపిడో సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.