గ్రూప్ 1 కేసులో TGPSCకి ఎదురుదెబ్బ.. రీవాల్యుయేషన్కు వీలుకాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు అదేశాలు

గ్రూప్ 1 కేసులో TGPSCకి ఎదురుదెబ్బ.. రీవాల్యుయేషన్కు వీలుకాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు అదేశాలు

హైదరాబాద్: గ్రూప్ 1 కేసులో TGPSCకి ఎదురు దెబ్బ తగిలింది. ప్రశ్నా పత్రాలు మళ్ళీ దిద్దాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ధర్మాసనం స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ చేయడం వీలుకానట్లయితే తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పరీక్షలు రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. 

గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో ఇప్పటికే బలంగా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు.

కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే.. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట రెండు, మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు. మూల్యాంకనంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా పర్యవేక్షణ మధ్య జరిగిందని వెల్లడిస్తూ. ఆధారాల్లేని ఆరోపణలతో చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొట్టివేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు రీవాల్యుయేషన్ చేయడం వీలుకానట్లయితే తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని తీర్పు వెల్లడించింది.