లాక్‌డౌన్‌ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దు

లాక్‌డౌన్‌ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దు

లాక్‌డౌన్‌ సమయంలో లాయర్లను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఉంటే వారి క్లర్కులు, స్టెనోలను కూడా అనుమతించాలని సూచించింది. లాక్‌డౌన్‌ సమయంలో న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి లాయర్ల రాకపోకలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు లాయర్లు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయవద్దని సూచించింది. గుర్తింపు కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది.