మెడికల్‌‌ సీట్ల ఫీజులను సవరించండి.. కాలేజీలకు హైకోర్టు ఆదేశం

మెడికల్‌‌ సీట్ల ఫీజులను సవరించండి..   కాలేజీలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ప్రైవేట్, అన్‌‌ఎయిడెడ్, నాన్‌‌ మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్‌‌ కాలేజీల్లో జీవో 107 ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వసూళ్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏ కేటగిరీ సీట్లకు 60 శాతం, బీ -కేటగిరీ సీట్లకు 70 శాతం చొప్పున ఫీజులు వసూలు చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

తుది తీర్పుకు అనుగుణంగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థులు వ్యక్తిగతంగా ఆయా కాలేజీలకు అఫిడవిట్లు సమర్పించాలని చెప్పింది.ఈ మేరకు జస్టిస్‌‌ చిల్లకూరు సుమలత ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2023–26 సంవత్సరానికి పీజీ మెడికల్, డెంటల్‌‌ కాలేజీ ఫీజుల్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం జులై 28న జారీ చేసిన జీవో 107ను సవాల్‌‌ చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను వాయిదా వేశారు.