బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టు కీలక  వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సస్పెండైన ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ వద్దకు వెళ్లి వాదనలు వినిపించాలని సూచించింది. సస్పెన్షన్ పై తుది నిర్ణయం స్పీకర్దేనని స్పష్టం చేసింది.  ఎమ్మెల్యేల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. వారిని సభాపతి వద్దకు తీసుకెళ్లే బాధ్యతను అసెంబ్లీ సెక్రటరీకి అప్పగించింది. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సభలో ప్రజా ప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అభిప్రాయపడింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకోవచ్చని స్పష్టం చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే ముగ్గురు బీజేపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. స్పీకర్ నిర్ణయంపై ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.