మైగ్రెంట్స్‌ బాధ్యత రాష్ట్ర సర్కారుదే

మైగ్రెంట్స్‌ బాధ్యత రాష్ట్ర సర్కారుదే

హైదరాబాద్, వెలుగు: ‘‘విపత్తుల సమయంలో పౌరుల బాధ్యత ప్రభుత్వాలదే. లాక్‌‌డౌన్‌‌లో చిక్కుపోయిన వలస కూలీలు ఇక్కడ ఉన్నంతకాలం వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీరందరినీ సొంత రాష్ట్రాలకు పంపేందుకు సర్కారే చర్యలు తీసుకోవాలి. శ్రామిక్‌‌ట్రైన్స్, ఆర్టీసీ బస్సుల్లో వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్రమే భరించాలి. లేబర్‌‌డిపార్ట్‌‌మెంట్‌‌డిప్యూటీ కమిషనర్‌‌ఇటుక బట్టీల వద్దకు వెళ్లి ఇంకా ఇక్కడే ఉన్న వలస కూలీలపై నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా కూలీలను పంపేందుకు చర్యలు తీసుకోవాలి”అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇటుక బట్టీలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలను హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్‌‌ఏరియాలకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి.. ఆశ్రయం కల్పించాలని సూచించింది. రైళ్లలో నాలుగు బోగీలను వీరి కోసం కేటాయించాలని, ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని తెలంగాణ సరిహద్దుల వద్ద సదరు రాష్ట్రానికి చెందిన బస్సు ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

షెల్టర్‌‌హోమ్స్‌‌లోని వారికి ఆహారం, తాగునీరు, మందులు అందజేయాలని చెప్పింది. తమ ఆదేశాలపై చర్యల నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కూలీల తరలింపు– వారి సంక్షేమం కోసం సమగ్ర విధానాన్ని తయారు చేయాలని చీఫ్ జస్టిస్‌‌ఆర్‌‌ఎస్‌‌చౌహాన్, జస్టిస్‌‌బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌బెంచ్‌‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్‌‌రోడ్‌‌లో నిత్యం వందలాది మంది వలస కూలీలు మండుటెండలో నడుచుకుంటూ వెళుతున్నారని, లాక్‌‌డౌన్‌‌లో చిక్కుకుపోయిన వారిని సొంత రాష్ట్రాలకు పంపేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిల్స్​పై హైకోర్టు విచారణ జరిపింది. రంగారెడ్డి జిల్లా లీగల్‌‌సర్వీసెస్‌‌అథారిటీ కార్యదర్శి అయిన జిల్లా సీనియర్‌‌సివిల్‌‌జడ్జి జి.ఉదయ్‌‌కుమార్‌‌తో కలిసి లాయర్​ కౌటూరు పవన్‌‌కుమార్‌‌నేతృత్వంలోని అడ్వొకేట్‌‌కమిషన్‌‌క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా పలు సిఫార్సులు చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ప్రసాద్‌‌, పిటిషనర్ల తరఫున లాయర్​ వసుధా నాగరాజ్, లాయర్​ పవన్​కుమార్​ వాదనలు వినిపించారు.

తెలంగాణలో 92కు చేరిన కరోనా మరణాలు