ప్రైవేట్ స్కూళ్లపై హైకోర్టు సీరియస్

ప్రైవేట్ స్కూళ్లపై హైకోర్టు సీరియస్
  • ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని ఆగ్రహం
  • సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నలు
  • అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ వచ్చె నెల 9 కి వాయిదా

ప్రైవేట్ స్కూళ్లపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న పాఠశాలల యాజమాన్యాలపై  తెలంగాణ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో 9 పిటిషన్ లు దాఖలు కాగా..  న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. గతంలో తిరుపతి రావు అనే వ్యక్తి ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ను కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించింది.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు నోటీసులు జారీ చేసిన హై కోర్టు..  ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న అన్ని పాఠశాలల రిపోర్ట్ ను కోర్టుకు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిటీ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలపాలని, అన్ని వివరాలతో డీటైల్ రిపోర్ట్ ను ఏప్రిల్ 8 న సమర్పించాలని ప్రభుత్వానికి అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది.