హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హైకోర్టు అఫిషియల్ వెబ్సైట్లో ఒక్కసారిగా ఆన్ లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని.. సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్‌లోకి వెళ్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదైంది.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీ గేమింగ్ యాప్‌ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైట్ హ్యాకింగ్‌కు గురికావడంతో కాసేపు కోర్టు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌ఐసీ అధికారులు వెంటనే హైకోర్టు వెబ్‌సైట్‌ను రిస్టోర్ చేశారు. దీంతో యధావిధిగా కోర్టు కార్యకలాపాలు నడుస్తున్నాయి.
