
ఓఎంసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు. శుక్రవారం ( జులై 25 ) ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ డిస్మిస్ చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఓఎంసీ మైనింగ్ లీజు వ్యవహారంలో 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఓఎంసీ లీజు కట్టబెట్టే విషయంలో శ్రీలక్ష్మి అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. శ్రీలక్ష్మి బాధ్యతలు సువికరించక ముందే.. లీజ్ వ్యవహారం నడిచిందని శ్రీలక్ష్మి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో A8 కృపానందం , A9 సబితా ఇంద్రారెడ్డి ని నిర్దోషిగా ప్రకటిస్తూ ఇదివరకే సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ వాదనలతో పాటు, సీబీఐ జడ్జ్మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు శ్రీలక్ష్మి. ఇరు వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి జూన్ 11న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. సీబీఐ తీర్పుప్పై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. రూ. 10 లక్షల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని.. ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లోద్దని ఆదేశించింది కోర్టు.