పరిశోధనల బలోపేతానికి ‘జర్నల్’ .. రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

పరిశోధనల బలోపేతానికి ‘జర్నల్’ .. రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ  చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశోధనలు, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకుగానూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీజేహెచ్ఈ)’ పేరిట తొలి సంచికను ప్రచురించింది. దీన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు సోమవారం ఆవిష్కరించారు.

 ఎడ్యుకేషన్ లో క్వాలిటీ పెంచేందుకు ఇలాంటి జర్నల్స్ ఉపయోగపడతాయని బాలకిష్టారెడ్డి అన్నారు. ఈ తొలి సంచిక ఉన్నత విద్య, సాంకేతికతపై అర్థవంతమైన విద్యాపర చర్చకు వేదికగా నిలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.