- మహిళా పోలీసుల పట్ల అనుచిత ప్రవర్తనపైనా విచారణకు ఆదేశం
అబిడ్స్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తల్లిని దూషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవహారంతో పాటు, మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ నేతల అనుచిత ప్రవర్తనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) స్పందించింది. ఈ రెండు ఘటనలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ తల్లిని దూషించారని, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద దళితుల నిరసన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించారని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల అర్ధనగ్న నిరసనలతో మహిళా సిబ్బంది వేదనకు గురయ్యారని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ మరో ఫిర్యాదు అందజేశారు. ఈ రెండు ఫిర్యాదుల వచ్చే నెల 9 లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది.
