- పీఆర్, ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్-I) రూ.3,500, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రూ.2,200, రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్-II) రూ.2,000, మైక్రో అబ్జర్వర్‌కు రూ.2,000, మిగిలిన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

