సౌత్- నార్త్ అంటూ రెచ్చగొడుతున్నరు.. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర కృషి చేస్తోంది

సౌత్- నార్త్ అంటూ రెచ్చగొడుతున్నరు.. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర కృషి చేస్తోంది

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ తరుపున హైదరాబాద్ గోల్కొండ కోటలో తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరించిందని...వేల కోట్ల నిధులు విడుదల చేసిందని  చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం అని కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం దివంగత నేత సుష్మస్వరాజ్ నేతృత్వంలో 160 మంది ఎంపీలు మద్దతు తెలిపారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై అన్ని పార్టీల కంటే ముందే కాకినాడలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని.. ఉద్యమంలో అన్ని వర్గాల పాత్ర ఉందన్నారు.

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సౌత్ , నార్త్  అని లింకు పెట్టొద్దు అని కోరారు. దక్షిణాది నుంచి కూడా ప్రధానులు అయ్యారని చెప్పారు. బీజేపీలో చేరిన వారు వెళ్లిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కాంగ్రెస్ బలంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. కొందరు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం ఉండదని..బీజేపీ నిరాశ నిస్పృహలో లేదన్నారు.