
కాలేజీల్లో 2019-20 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ శుక్రవారం విడుదల చేసింది. రెండు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని, అడ్మిషన్లకు స్టూడెంట్స్ ఆధార్‌నెంబర్ తప్పనిసరి అని ప్రకటించింది. తొలివిడత అడ్మిషన్లలో భాగంగా ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని, తొలివిడత అడ్మిషన్లు జూలై 1నాటికి ముగించాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లన్నింటికీ ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని చెప్పారు.
ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటాలో 5, ఎక్స్ సర్వీస్‌మెన్స్ కోటాలో 3శాతం చొప్పున సీట్లు భర్తీ చేయాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు. కోర్సుల్లోని మొత్తం సీట్లలో 33శాతం బాలికలకు కేటాయించాలన్నారు. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే పిల్లలను చేర్పించాలని పేరెంట్స్ కు సూచించారు. ఆ కాలేజీల లిస్టును bie.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపారు. ప్రత్యేక కోర్సులకు రెండోవిడత షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామన్నారు.