
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు www.bie.telangana.go వెబ్‌సైట్‌ను లాగిన్ కావాల్సిందిగా తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన 1,52,384 మందితో పాటు, ఇంప్రూవ్ మెంట్ కోసం మరో 1,48,463 మంది కలిపి మొత్తం 3,00,847 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల 7 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.