
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2024, జూన్ 24వ తేదీన తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు బోర్డు అధికారులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది. విద్యార్థుల ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.